బాబుకు ముందుంది ముసళ్ల పండగ

6 Feb, 2020 11:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ‘చంద్రబాబు సవాల్‌ను స్వీకరించడానికి మా నాయకుడి వరకూ అవసరం లేదు. నేను గన్‌మెన్‌ లేకుండా వస్తా. ఎక్కడకు రావాలో చెప్పండి’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘పోలీసులు లేకుండా రండి’ అని బాబు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. ఆయన భద్రత కోసం ఉన్న బ్లాక్‌ కమాండోస్‌కు నెలకు రూ.60 ‍కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వాళ్లు లేకుండా బాబు తుళ్లూరులోనే కాదు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ ఎక్కడా తిరగలేరని ఎద్దేవా చేశారు.

తమ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే దిశగానే ఆలోచిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని రైతులను కోరారు. స్వార్థ రాజకీయాల కోసం ఆయన ఏమైనా చేయగల సమర్థుడని పేర్కొన్నారు. తన బినామీల ఆస్తులు కాపాడుకునేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. బాబుకు ముందుంది ముసళ్ల పండగ, తొందరపడొద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

చదవండి: చంద్రబాబు ఓ రాజకీయ ఉగ్రవాది 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా