మాయల మరాఠీ సర్కార్‌కు గుణపాఠం తప్పదు

13 Jul, 2018 11:13 IST|Sakshi
మాట్లాడుతున్న గజ్జెల కాంతం

కరీంనగర్‌: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ను అమలు చేయకుం డా మభ్యపెడుతున్న మాయలమరాఠీ సర్కార్‌కు గుణపాఠం చెప్పేం దుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం విమర్శించారు. గురువారం అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధి కారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ వాటికి తిలోదకాలు ఇచ్చి ధనార్జనే ధ్యేయంగా అవినీతి పాలన సాగి స్తోందని ఆరోపించారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి వంద సీట్లు రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్వేల పేరిట ప్రజలను మభ్యపెడుతూ మరోసారి అధికారంలోకి రావాలని కంటున్న కలలు నెరవేరబోవన్నారు.

సర్పంచ్‌ ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రభుత్వం తహతహలాడుతోందని, ఎన్నికలంటే సీఎంకు భయం పట్టుకుందన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లీస్తూ.. దళిత గిరిజనులను దగా చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి రానున్న రోజుల్లో భారీ మూల్యం తప్పదని హెచ్చరించా రు. సెంటిమెంట్‌ రాజకీయాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న ప్రభుత్వ తీరును ప్రజలు గ్రహిం చారన్నారు. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసు.. డ్రగ్స్, మియాపూర్‌ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటో వెల్లడించాలని డిమాండ్‌ చేశా రు. టీఆర్‌ఎస్‌ ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజ లు నమ్మే పరిస్థితిలో లేరని.. భూస్థాపితం చేసేం దుకు ప్రజలు కాసుకోని ఉన్నారని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు