అతిషి ఆరోపణలపై స్పందించిన గంభీర్‌

28 Apr, 2019 13:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తనకు రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నాయని తూర్పు తూర్పు ఢిల్లీ ఆప్‌ అభ్యర్థి అతిషి చేసిన ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు. ఓటు హక్కుకు సబంధించిన విషయాలు ఎన్నికల సంఘం చూసుకుంటుందని, చేసిందేమీ లేకపోవడంతో ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ‘విజన్‌ లేకపోవడంతో గత నాలుగున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు. చేసిందేమీ లేకపోవడంతో ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఓటరు కార్డుల అంశంపై ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది. మీకు(అతిషి) కనుక విజన్‌ ఉన్నైట్లెతే ఇలాంటి నీచ రాజకీయాలు చేయరు’  అని గంభీర్‌ ఘాటుగా బదులిచ్చారు. 

చదవండి : గంభీర్‌పై పోలీసులకు ఫిర్యాదు

గంభీర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నాయని, అలా ఉండడం నేరమని, ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్‌ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతిషి డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా తనకు రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు ఉందంటూ గంభీర్‌ తన అఫిడవిట్‌లో డిక్లరేషన్‌ ఇచ్చారని, కానీ రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు.

మరిన్ని వార్తలు