తమిళనాడులో అమిత్‌ షాకు చేదు అనుభవం

9 Jul, 2018 16:34 IST|Sakshi
అమిత్‌ షా (ఫైల్‌ ఫోటో)

చెన్నై పర్యటనకు నిరసనగా గోబ్యాక్‌ అంటూ ట్వీట్‌లు

సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు తమిళనాడులో ఊహించని షాక్‌ తగిలింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అమిత్‌ షా సోమవారం చెన్నైలో పర్యటించారు. ఒక్కరోజు పర్యటనకు వచ్చిన కమళ దళపతికి  ‘గోబ్యాక్‌ అమిత్‌ షా’ అంటూ తమిళ ప్రజలు ట్విటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఇదే టాగ్‌తో స్వల్ప సమయంలో 75 వేల ట్వీట్లు షేర్‌ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది. అమిత్‌ షా పర్యటనను నిరశిస్తూ తమిళనాడు ప్రముఖ పారిశ్రమికవేత్త సీకే కూమరవేల్‌ ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ‘తమిళ ప్రజలను దేశం పిచ్చివాళ్లగా, ఉగ్రవాదులు చూస్తోంది. ఇతరులను గౌరవించడం మాకు బాగా తెలుసు. మేము టుటీకోరిన్‌ ఉప్పును తింటాము. మీరు కూడా అది తినండి. ఇతరులను ఎలా గౌరవించాలో తెలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

మతపరంగా దేశాన్ని విడదీయాలని చూసే అమిత్‌ షా, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులను ఇక్కడ చోటు లేదంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. పిల్లలు, మహిళలు, దళితులకు హానీ చేసే వాళ్లను తమిళనాడు రానివ్వం అని ఓ యువకుడు ట్వీట్‌ చేశాడు. మాజీ సీఎం జయలలిత చనిపోయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన అమిత్‌ షా, నరేంద్ర మోదీలు చెన్నై రావడానికి వీళ్లేదని సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత ఏప్రిల్‌లో తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన కావేరీ వాటర్‌ బోర్డును ఏర్పాటు చేయడంలో కేంద్రం విఫలమైందని తమిళనాడు ప్రజలు కేంద్రంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు