పరీక్షలో నెగ్గిన సావంత్‌

21 Mar, 2019 03:55 IST|Sakshi

అనుకూలంగా 20 మంది, వ్యతిరేకంగా 15 మంది ఓటు

పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించగా, మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సావంత్‌ మాట్లాడుతూ.. పాజిటివ్‌గా ఉండాలి అనే పారికర్‌ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలని కోరారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్‌మృదులా సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది బీజేపీ, ముగ్గురు చొప్పున గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 14 మంది కాంగ్రెస్, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటేశారు. 

మరిన్ని వార్తలు