గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు ఆమోదం

26 Mar, 2019 12:39 IST|Sakshi

సాక్షి, అనంతపురం: హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్‌ నామినేషన్‌ను మంగళవారం ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్‌ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్‌ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్టయింది. 

సోమవారం హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాధవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.  హైకోర్టు తీర్పు కాపీలను కూడా రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన భార్య సునీతతో కూడా నామినేషన్‌ దాఖలు చేయించారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్‌లను పరిశీలించిన ఎన్నికల అధికారులు మాధవ్‌ నామినేషన్‌ను ఆమోదించినట్టు ప్రకటించారు. అలాగే అనంతపురం లోక్‌సభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్‌కు కూడా ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు