సంచలన వ్యాఖ్యలు చేసిన గడ్కరీ..

20 Jan, 2020 12:44 IST|Sakshi

నాగ్‌పూర్‌: సాహసోపేత  నిర్ణయాలు తీసుకునే ధైర్యం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వద్ద నిధులు ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో చొరవ చూపెట్టడం లేదంటూ సొంత ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ.. కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. గత ఐదేళ్లలో 17లక్షల కోట్లకు సంబంధించిన పనులను ప్రారంభించగా. ఈ సంవత్సరంలో 5లక్షల కోట్లకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించలేదన్నారు.

అయితే ఇక్కడ ప్రభుత్వం వద్ద నిధులు లేక కాదని, వచ్చిన సమస్యంతా నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమే కారణమన్నారు. నిర్ణయం తీసుకునే చొరవ లోపించడంతోనే నిధులు మంజూరులో వెనుకడుగు వేస్తున్నారన్నారు. ప్రతికూల వైఖరి వల్లే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం లేదని అన్నారు. ఐఏఎస్‌ అధికారులు, బ్యూరోక్రాట్ల వ్యవస్థ గురించి స్పందిస్తూ.. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఐఏఎస్‌ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైతే ఇక ఇక్కడ కూర్చొని ఏమి ఉపయోగం అంటూ ఎద్దేవా చేశారు. ఇక తమకు నైపుణ్యమున్న రంగాలవైపే ప్రజలు దృష్టి పెట్టాలని గడ్కరీ సూచించారు.
చదవండి: గడ్కరీని రంగంలోకి దించడం

మరిన్ని వార్తలు