ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది

7 Oct, 2019 03:59 IST|Sakshi
సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇస్తున్న ఆర్టీసీ కార్మిక నేతలు అశ్వత్థామరెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా రవాణాకు ఉపయోగపడే ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాల్లోంచి తీసేస్తామని బెదిరించడం భావ్యం కాదని, తెలంగాణ సంపదైన ఆర్టీసీని కాపాడుకోవడం అందరి బాధ్యత అని భట్టి అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయనతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీలో జరుగుతున్న సమ్మె, అందుకు దారి తీసిన పరిస్థితులు, ప్రభుత్వ వైఖరిని వివరించి తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని, కార్మికులు చేపట్టే ప్రతి ఆందోళనకూ తమ మద్దతు ఉంటుందని భట్టి స్పష్టం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు