ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌: మొయిలీ

4 Apr, 2020 14:18 IST|Sakshi
వీరప్ప మొయిలీ

ముంబై: మోదీ సర్కారు ముందుచూపు లేకుండా లాక్‌డౌన్‌ విధించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీరప్ప మొయిలీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డాన్‌ వల్ల తలెత్తె పరిణామాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లిందని దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి యుద్ధం చేసినట్టుగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇలాంటి సమయంలో ఆర్థిక లోటు గురించి ఆలోచించకుండా ప్రజలకు అన్నిరకాలుగా సాయం అందించాలని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. 21 రోజుల నిర్బంధం గడువు ముగిసిన తర్వాత లాక్‌డౌన్‌ బాధితులకు అండదండలు అందించాలని కేంద్రానికి సూచించారు. 

‘ఇది(కోవిడ్‌పై పోరు) యుద్ధం లాంటిదే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. ఆర్థిక లోటును సవరించుకుని అత్యవసర పరిస్థితిని తక్షణం ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. కరోనా నివారణ చర్యలకు ప్రైవేటు రంగం సరైన విధంగా స్పందించలేద’ని వీరప్ప మొయిలీ అభిపప్రాయపడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ‘తబ్లిగీ జమాత్’ను అనుమతించడాన్ని పెద్ద తప్పిదంగా ఆయన వర్ణించారు. ‘ఈ తెలివైనోళ్లంతా అప్పుడు ఏం చేస్తున్నారు. కరోనా పరిణామాల గురించి పూర్తిగా  తెలిసినా అధికార యంత్రాంగం ఎందుకు తబ్లిగీ జమాత్‌ను అనుమతించింద’ని మొయిలీ ప్రశ్నించారు. కాగా, కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వ్యాఖ్యానించింది. (భారత్‌ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కాదు)

మరిన్ని వార్తలు