సమాన ప్యాకేజీ ఇవ్వాలి: మేరుగ

31 Jul, 2018 14:06 IST|Sakshi

అమరావతి : తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్ భూములను వైఎస్సార్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, హెన్ని క్రిష్టినా పరిశీలించారు. అనంతరం క్రిస్టినాతో కలిసి మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్ల నుంచి అసైన్డ్ భూమలు సాగు చేసుకుంటుంటే..ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యకుండా అధికారులు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంటనే దళితులు సాగు చేసుకుంటున్న భూములను వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.

 ప్రభుత్వం వెంటనే 41 జీవోను రద్దు చెయ్యాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టా భూమితో సమానంగా ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చేసి దళితులకు న్యాయం చెయ్యకపోతే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు పంపారు.

మరిన్ని వార్తలు