కాస్తా బాధ్యతగా మాట్లాడండి: ప్రభుత్వ విప్‌

23 Apr, 2020 15:16 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయం కోసం మాట్టాడుతన్న టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులకు సిగ్గుండాలని ఏపీ ప్రభుత్వ విప్‌ దాడిశేట్టి రాజా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మేము అప్పుటు చేసి రాష్ట్రాన్న దీవాళ తీశామని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలించలేరని చెప్పిన మాటలు యనమలకు గుర్తులేదా అన్నారు. బురదలో పందులు దొర్లుతున్నాయి.. మీరు దోర్లుతున్నారు ​కాస్తా బాధ్యతగా మాట్లాడమని యనమల, వెంకట్రావ్‌లను ఆయన హెచ్చరించారు. (‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’)

ఇక ఎల్లో మీడియాలో గంటల తరబడి చంద్రబాబు చేస్తున్న ప్రసంగం విని... ప్రజలు మాకీ కర్మేంటి బాబు అంటూ దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల బాగోగులు చూడకుండా ప్రతి అరగంటకు పచ్చ మీడియా ముందు ప్రెస్‌మిట్‌లు పెట్టేవారన్నారు. ప్రజల హృదయం తెలిసిన వ్యక్తి సీఎం జగన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ వంటి పరిస్థితుల్లో మహిళలకు వడ్డిలేని రుణాలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్రమే గుర్తించిందని చెప్పారు. కరోనాను అరికట్టడంలో సీఎం జగన్‌ విజయం సాధిస్తున్నారన్నారు. అంతేగాక దేశానికి దిక్చూచిగా కరోనాను నివారిస్తారని ఆయన అన్నారు. (ఏపీని అన్ని రాష్ట్రాలు అభినందిస్తున్నాయి..)

మరిన్ని వార్తలు