సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

28 May, 2018 14:23 IST|Sakshi
మాట్లాడుతున్న అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి  

ఖమ్మంవ్యవసాయం: లారీ యజమానుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని స్వీకెల్‌ రిసార్ట్స్‌ అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర లారీ యజమానుల సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు పూర్తయినా లారీ రవాణా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోలేదన్నారు. సమస్యలను వివరిస్తూ ప్రభుత్వానికి అనేకమార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. మంత్రులను కలిసినా, నిరసన, ఆందోళనలు, బంద్‌ వంటి కార్యక్రమాలను చేపట్టినా ప్రభుత్వాల నుంచి కనీస స్పందన లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించిన పన్నులనే ఇప్పటికీ చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

బీమా ప్రీమియంను ప్రతి ఏడాది పెంచ డం బాధాకరమన్నారు. ఎగుమతులు, దిగుమతులను కూడా లారీ యజమానులపై మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలంలో డీజిల్‌ ధరలు రూ. 50 నుంచి రూ. 75లకు పెరిగాయని, వాటికి అనుగుణంగా కిరాయిలు పెరగలేదన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలను ఆమోదించారు.

కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం ఖమ్మం అధ్యక్ష, కార్యదర్శులు నకిరకంటి సత్యంబాబు, బోజెడ్ల  పూర్ణచందర్‌రావు, వరంగల్, కరీంగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, మణుగూరు. ఇల్లెందు, కొత్తగూడెం, సూర్యాపేట,  హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలకు చెందిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు