కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!

19 May, 2018 16:31 IST|Sakshi
యడ్యూరప్ప రాజీనామా ప్రకటించగానే అసెంబ్లీలో కుమారస్వామి సంబరాలు

సాక్షి, బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన దరిమిలా గవర్నర్‌ వజుభాయ్‌ వాలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారమే కుమారస్వామికి గవర్నర్‌ నుంచి పిలుపు రానున్నట్లు తెలిసింది. ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని కన్నడ రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటు కుమారస్వామి సైతం మీడియాతో మాట్లాడుతూ ‘గవర్నర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.
(చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప)

మరిన్ని వార్తలు