నిజాయితీపరులకు చౌకీదార్‌ను: మోదీ

13 Feb, 2019 03:53 IST|Sakshi
కార్యక్రమంలో మహిళా సర్పంచ్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న మోదీ

కురుక్షేత్ర: దేశంలో అవినీతిని అంతం చేసేం దుకు తమ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అవినీతిపరులకు తనతో సమస్య ఉందన్న ఆయన.. నిజాయితీపరులు మాత్రం కాపలా దారు (చౌకీదారు)గా తనను నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చ డంలో గ్రామీణ మహిళల నాయకత్వ పాత్రను గుర్తించే కార్యక్రమం ‘స్వచ్ఛ్‌శక్తి–2019’ మంగళవారం కురుక్షేత్రలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు.

హర్యానాలోని అవినీతిపరులపై ప్రస్తుతం సాగుతున్న దర్యాప్తులతో కొందరు కలవరం చెందుతున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మహా కూటమిని కల్తీ కూటమి (మహా మిలావత్‌)గా అభివ ర్ణించిన ఆయన.. ‘కల్తీ కూటమిలోని నేతలంతా కలిసి కోర్టులను, మోదీని, దర్యాప్తు సంస్థలను దూషించడం, బెదిరించడంలో పోటీలు పడు తున్నారు. కానీ, ఈ చౌకీదారు వారి దూష ణలు, బెదిరింపులకు అదరడు బెదరడు, ఆగ డు, లొంగడని మీకు తెలుసు. దేశానికి పట్టిన అవినీతి మరకలు, బురదను తొలగించే శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. అందుకు మున్ముందు కూడా మీ ఆశీస్సులు కావాలి’ అని ప్రధాని మోదీ కోరారు.
 

మరిన్ని వార్తలు