'బ్యాంకుల్లో ప్రజల కష్టం ఉంది.. బాధ్యత మీదే'

22 Feb, 2018 16:36 IST|Sakshi
ఉద్దవ్‌ ఠాక్రే (శివసేన పార్టీ అధినేత)

సాక్షి, ముంబయి : ప్రజలకు బ్యాంకులపై నమ్మకంపోతోందని, వాటిని అనుమానించే పరిస్థితి తలెత్తిందని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. బ్యాంకులు ఉన్నపలంగా దెబ్బతింటే ప్రజల సొమ్ముకు భద్రత కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలు ఎంతో కష్టపడి తమ డబ్బును కూడ బెట్టుకొని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఈ సందర్భంగా మేం ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వచ్చినా దెబ్బతిన్నా ప్రజల సొమ్ముకు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. మరోసారి బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటారా అనే ప్రశ్నకు ఉద్దవ్‌ కొట్టిపారేశారు. 'మేం మహారాష్ట్ర ప్రజల కోసమే పోరాడుతున్నామని వారు ఇప్పుడిప్పుడే మాపై మరింత నమ్మకం పెట్టుకుంటున్నారు. మేం దాన్ని వమ్ము చేయబోము' అని ఉద్దవ్‌ ఠాక్రే చెప్పారు.

మరిన్ని వార్తలు