నేడు ‘మండలి’ ఫలితాలు

26 Mar, 2019 05:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపా ధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యా య నియోజకవర్గాల ఓట్లను కరీంనగర్‌ పట్టణం లోని ఇండోర్‌ స్టేడియంలో లెక్కించనున్నారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్లను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని టీఎస్‌డబ్ల్యూసీ గోదాములో లెక్కించనున్నారు. పోలింగ్‌ను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి ఆలస్యం కానుంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సీఈఓ రజత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫలితాల కోసం క్లిక్‌చేయండిఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు షాక్‌

మరిన్ని వార్తలు