బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది: ఎంపీ అవంతి

21 Jan, 2018 18:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఇక్కడ జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ ది ఎంత పాపముందో బీజేపీది కూడా అంతే ఉందన్నారు. ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేదని అన్నారు. సీఎం తన స్థాయిని తగ్గించుకుని వెళ్లి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రాజధానికి రూ.30 వేల కోట్లు అడిగితే రూ.3 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు.

కేంద్ర విద్యా సంస్థలకు రూ.11, 600 కోట్ల భూములు ఇస్తే వాటికి రూ.150 కోట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇది చివరి బడ్జెట్.. ఇప్పుడు రాకపోతే మళ్లీ నిధులు ఇచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు ఎలాంటి బుద్ధి చెప్పారో బీజేపీకి కూడా అలాగే బుద్ధి చెబుతారని అవంతి అన్నారు. ఈయన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధులు రావని చెప్పారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడనని, దీనిపై ఎంతవరకైనా వెళ్లానని స్పష్టం చేశారు. 

కాగా, అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధులు రావని, అలాగని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడబోనని చెప్పారు. ఎంతవరకు అయినా వెళ్తానని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు