చంద్రబాబు బ్యాక్‌డోర్‌ పొలిటీషియన్‌..

15 Jul, 2020 18:26 IST|Sakshi

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్

సాక్షి, విశాఖపట్నం: విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. విశాఖలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని సందేహం వ్యక్తం చేశారు. తన అనుమానాలను నిజం చేసేలా చంద్రబాబు స్పందించారని... విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ యత్నాన్ని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 

బుధవారమిక్కడ అమర్‌నాథ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచాలన్న కేబినెట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని.. ఆయన స్టేట్‌ కోసం ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేక బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ బ్యాక్‌డోర్‌ పొలిటీషియన్‌ అని.. విశాఖ ఫార్మా కంపెనీల ప్రమాదంపై ఆయన స్పందించిన తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు. (తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..!)

‘‘గతంలో ఫార్మా కంపెనీ లో ప్రమాదాలు జరగలేదా ? గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైనా మీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా ?కంపెనీ లోపల జరిగిన ఘటనలో కూడా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం 50 లక్షల పరిహారం ఇచ్చారు. మీ షూటింగ్‌ల కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే మీరు ఏం ఇచ్చారు. చంద్రబాబు శరీరంలో రక్తం లేదు. కుట్ర.. కుతంత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ కుట్ర పూరితంగా తీసుకోలేదా’’ అని ప్రశ్నించారు. కాపీ కొట్టే విద్యార్థికి వేరుగా పరీక్ష రాయిస్తే ఎలా వుంటుందో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 2019 వచ్చిన ఫలితాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.(చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్‌!)

చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
‘‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం అరటి తోటలను తగులబెట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్ల పేరిట అమాయక రైతులను చంపించారు. ఆ ఎర్ర చందనం చంద్రబాబు పొలంలో దొరికింది. దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు? విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. సీఎం జగన్ ఈ విషయంపై విచారణ జరిపించాలి’’అని అమర్‌నాథ్‌ కోరారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా