సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్‌లో చర్చించాలా?

27 Jan, 2020 16:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన శాసన మండలి రద్దు తీర్మానంలో అసెంబ్లీలో మాట్లాడుతూ..  స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

(చదవండి : ‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’)

శాసనమండలిలో టీడీపీ సభ్యుల నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందన్నారు. ‘  మండలి రద్దు అంశంపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు... సభలో చర్చింకుండా ఈనాడు, ఆంద్రజ్యోతిలో చర్చించాలా’  అని ప్రశ్నించారు. పెద్దల సభలో పెద్దలు లేరని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజల అభివృద్ధి కోసం సభలో చట్టాలు చేస్తుంటే.. రాజకీయం కోసం మండలిలో టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. వికేంద్రీకరణ బిల్లును మాత్రమే కాకుండా.. గతంలో తీసుకువచ్చిన ఇంగ్లీష్‌ మీడియం బిల్లును కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి విశాఖపై టీడీపీ సభ్యులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబుకు రాష్ట్రం బాగోలు అవసరం లేదని, తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుంటే చాలని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు కానీ 13 జిల్లాకు విలన్‌ అయ్యారన్నారు.  శాసన మండలి రద్దు బిల్లుతో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్‌ ధైర్యాన్ని ఇచ్చారని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు