‘పోతే అమెరికాకు.. లేదంటే సన్యాసమే’

18 Nov, 2018 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి కేటీఆర్‌ వెళితే అమెరి కాకు వెళ్లాలని, లేదంటే ఆయన భాషలో సన్యాసం తీసుకోవాల్సిందేనని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానిం చారు. ఓటమి అంచున ఉన్నందునే అలాంటి మాట లు మాట్లాడుతున్నారని అన్నారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓడిపోతే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలే తప్ప సన్యాసం తీసుకుంటాననడం చినరాజు కేటీఆర్‌కు సరైంది కాదని తెలిపారు.

శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటిం టికీ నీరు, ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన పెదరాజు కేసీఆర్‌ ఏం మొహం పెట్టుకుని ఇప్పుడు ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారన్నారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని, దీనిపై డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీలు దృష్టి సారించాలని కోరారు. పార్టీ టికెట్ల కేటాయింపు కొందరికి భరించలేని బాధను మిగిల్చిందని, వారందరికీ భవిష్యత్‌లో తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు. డిసెంబర్‌ 12న కూటమి పక్షాన ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు