అందుకే చంద్రబాబు స్టిక్కర్‌ బాబు: జీవీఎల్‌

22 Feb, 2019 13:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్టిక్కర్‌ బాబు’ అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తుందని తెలిసి చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ అనే స్టిక్కర్‌ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. తాను అన్ని చేశానంటూ గొప్పులు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

రాజమండ్రిలో అమిత్‌ షా వాస్తవాలు చెప్తుంటే.. అవి టీడీపీ నాయకులకు మింగుడుపటడం లేదని జీవీఎల్‌ విమర్శించారు. అమరావతి పేరుతో అవినీతి కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ సినిమాలో కూడా అన్ని అవాస్తవాలే చూపించారని.. అందుకే ప్రజలు ఆ సినిమాను వ్యతిరేకించారని అన్నారు. కుమార్తెను చూడటం కోసం జగన్‌ లండన్‌కు వెళ్లారని, అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారంటూ ఆరోపించడం హస్యాస్పదంగా ఉందన్నారు. అంటే టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలు చేసేది డబ్బు ఏర్పాటు చేసుకునేందుకేనా అంటూ ప్రశ్నించారు. టీడీపీ వ్యవహారశైలి నచ్చకే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని ఆయన ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా

షీలాకు కన్నీటి వీడ్కోలు

ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!

కర్నాటకంలో కాంగ్రెస్‌ సీఎం!

2 కోట్లు.. ఓ పెట్రోల్‌ బంకు

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్‌

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

కిషన్‌రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత

‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

చంద్రబాబు వైఫల్యంతోనే... 

‘కేసీఆర్‌ సారు, కేటీఆర్‌ సారు ఉండవు’

‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘ఇప్పుడు వెళ్తున్నా.. త్వరలోనే మళ్లీ వస్తా’

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్‌ ఎవరో’

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం