లేఖ రాయకపోతే ఎందుకు మౌనం..

19 Mar, 2020 17:21 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేఖ తాను రాయలేదని ఏఎన్ఐకి ఈసీ రమేష్‌ చెప్పారని తెలిపారు. టీడీపీ నేతలు మాత్రం ఎలక్షన్‌ కమిషనర్ లేఖ రాశాడని వకాల్తా పుచ్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై చాలా అనుమానాలు వస్తున్నాయని, దీని వెనకాల ఏ కుట్ర జరిగిందో బయటకు రావాలని జీవీఎల్ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అందరూ కాపాడుకోవాలని తెలిపారు. ఈసీ రమేష్‌కుమార్‌ స్పందించటం లేదంటే.. ఏదో తప్పు జరిగిందని అనుమానం వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హింస జరిగిందని ఈసీ లేఖ రాశారు. అలా అయితే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు అని జీవీఎల్‌ సూటిగా ప్రశ్నించారు.(‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’)

ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి గౌరవించి సుప్రీంకోర్టు సైతం వాయిదా విషయంలో జోక్యం చేసుకోలేదని జీవీఎల్‌ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను రాజకీయం కోసం దుర్వినియోగం చేయకూడదాన్నారు. లేఖ రాయకపోతే మౌనంగా ఈసీ రమేష్‌కుమార్ ఎందుకు ఉంటున్నారని జీవీఎల్‌ ప్రశ్నించారు. మాట్లాడకుండా ఉండడం రాజ్యాంగ సంస్థకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

మరిన్ని వార్తలు