-

తుపాను సాయం ఎవరికిచ్చారో పేర్లు వెల్లడించాలి: జీవీఎల్‌

19 Dec, 2018 16:43 IST|Sakshi
బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు

ఢిల్లీ: మరోసారి టీడీపీ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శలు సంధించారు. ఢిల్లీలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. విపత్తు కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. గతంలో విపత్తు నిధి కింద రూ.2200 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదలం చేసింది.. దాన్ని ఎలా ఖర్చు పెట్టారో టీడీపీ ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడికి పాలనపై దృష్టి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాతో కలిసి లేకపోయినా తిత్లీ తుపాను సంభవించినప్పుడు రూ.559 కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు.

టీడీపీ నాయకులు అడ్డుగోలుగా లెక్కలు రాస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. తుపాను సాయం కింద ఎవరికి డబ్బులు ఇచ్చారో వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సొమ్మును ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పి తన నిజాయతీ నిరూపించుకోవాలని చంద్రబాబుకి హితవు పలికారు.

మరిన్ని వార్తలు