వారందరి లెక్క తేలుస్తాం: కిషన్‌ రెడ్డి

31 May, 2019 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రిగా బాధ్య‌త‌లు ఇవ్వ‌డం సంతోషంగా ఉందని సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ కేటాయింపుల్లో హోంశాఖ సహాయమంత్రిగా కిషన్‌ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. కీలక బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. నేష‌న‌ల్ సిటిజ‌న్ రిజిస్ట‌ర్ త‌యారిపై ప్ర‌ధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఉగ్రవాద కార్యకలపాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ‌రు ప‌డితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధ‌ర్మ స‌త్రం కాదని చెప్పారు. భార‌తీయులెవరు? చొర‌బాటుదారులెవ‌ర‌నేది లెక్క త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు. ఎక్క‌డ ఉగ్ర‌వాద ఘ‌ట‌న జ‌రిగినా హైద‌రాబాద్‌ను మూలాలుంటున్నామని, ఉగ్ర‌వాదులు హైద‌రాబాద్‌ను సేఫ్ జోన్‌గా చేసుకుంటున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తాని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. పోలీసుశాఖ‌ను ఆధునీక‌రించి బ‌లోపేతం చేస్తామన్నారు. దేశ స‌మ‌గ్ర‌త‌, ఐక్య‌త‌, భ‌ద్ర‌త మా ప్ర‌ధాన ల‌క్ష్యమని, గ‌తంలో బీజేవైఎం అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు సీమా సుర‌క్ష పేరుతో 25 రోజులు యాత్ర చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించిన హోంశాఖ‌కు మంత్రికావ‌డం సంతోషంగా ఉందన్నారు. ‘‘సంప‌ద‌కు గుర్తు ల‌క్ష్మిదేవి...తొలిసారిగా ఆర్థిక‌శాఖ‌కు మ‌హిళా మంత్రి అయ్యారు. దేశాభివృద్ధికి, తెలుగురాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాల స‌హాయం చేస్తారని భావిస్తున్నాం.  తెలంగాణ‌లో బీజేపీని టీఆర్‌ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా తీర్చిదిద్దుతాం. బీజేపీలో చేరేందుకు చాలా మంద్రి సంప్ర‌దిస్తున్నారు. వారందరినీ చేర్చుకుంటాం’’  అని అన్నారు. 

చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

మరిన్ని వార్తలు