ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు: హార్ధిక్‌

13 Dec, 2017 13:59 IST|Sakshi

తనపై వచ్చిన తాజా ఆరోపణలను తోసిపుచ్చిన హార్ధిక్‌ పటేల్‌

అహ్మదాబాద్‌ :  సీడీల వ్యవహారంతో వార్తల్లో నిలిచిన పటేల్‌ ఉద్యమ నాయకుడు హార్థిక్‌ పటేల్‌ తనపై వచ్చిన తాజా ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్నికల సమయంలో తాను సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాను కలిసినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని హార్ధిక్‌ పటేల్‌ ధ్వజమెత్తారు. రేపో...మాపో తాను నవాజ్‌ షరీఫ్‌, దావూద్‌ ఇబ్రహీంను కలిసినట్లు ప్రచారం చేసేలా ఉన్నారని ఆయన విమర్శించారు. బీజేపీ ఇలాంటి చెత్త రాజకీయాలు చాలా చేస్తుందని వ్యాఖ్యానించారు.

కాగా హార్ధిక్‌ పటేల్‌పై ఆయన మాజీ అనుచరుడు దినేశ్‌ బంభూనియా మరో బాంబ్‌ పేల్చారు. ఎన్నికలకు ముందు హార్ధిక్‌ నాలుగు సార్లు రాహుల్‌ గాంధీని, ఓ సారి రాబర్ట్‌ వాద్రాతో రహస్యంగా సమావేశం అయినట్లు ఆరోపణలు చేశారు. ఈ మంతనాలు ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగాయని దినేశ్‌ బంభూనియా తెలిపారు. ఈ సీక్రెట్‌ మీటింగ్‌ ఎందుకన్నది హార్ధిక్‌ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హార్థిక్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రెండో దశ పోలింగ్‌ గురువారం జరగనుంది.

మరిన్ని వార్తలు