పరిశ్రమలకు పెద్దపీట 

20 Jan, 2020 01:58 IST|Sakshi
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్, బీజేపీతో ఒరిగేదేమీ లేదు

ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌   

తూప్రాన్‌: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి మెదక్‌ జిల్లా లోని తూప్రాన్, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతశేఖర్‌గౌడ్‌లతో కలిసి తూప్రాన్‌ మున్సిపల్‌ వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్‌లో రూ.900 కోట్లతో ఐటీసీ పరిశ్రమ ఏర్పాటై నిరుద్యోగులకు ఉపాధి కల్పిం చిందన్నారు. ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చేతి గుర్తు, పువ్వు గుర్తు పార్టీలు దారం తెగిన పతంగిలాంటివి అని ఎద్దేవా చేశారు. 

గజ్వేల్‌లో రోడ్‌షో: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో హరీశ్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీని మరింతగా విస్తరింపజేయడానికి సీఎం ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.  

హుస్నాబాద్‌లో..: హుస్నాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో హరీశ్‌ రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ దిక్కుదివాణం లేనిదని, గల్లీలో, ఢిల్లీలో ఆ పార్టీకి నాయకులు లేరని, కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా