ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా

12 Oct, 2019 02:13 IST|Sakshi
కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న ఆజాద్, కుమారి సెల్జా

హరియాణా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్‌

చండీగఢ్‌: హరియాణా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా మహిళలపైనే దృష్టి సారించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, రైతులకు రుణ మాఫీ హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్పయాత్రగా అభివర్ణించిన ఆ పార్టీ హరియాణా రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం కోటా అమలు చేస్తామంది. రైతులకు రుణమాఫీ, ఎస్సీ విద్యార్థులు, అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి 12 వేల రూపాయల స్కాలర్‌ షిప్, పదకొండు, పన్నెండు తరగతులకు ఏడాదికి 15 వేల రూపాయలు స్కాలర్‌ షిప్‌ ఇస్తామని హరియాణా కాంగ్రెస్‌ చీఫ్‌ కుమారి సెల్జా వెల్లడించారు. షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు