70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత

24 Aug, 2019 04:21 IST|Sakshi

కేవలం 70 రోజుల్లో పోదు: నఖ్వీ

న్యూఢిల్లీ: బీజేపీ పట్ల మైనార్టీల మనసుల్లో వ్యతిరేకత 70 ఏళ్లుగా నాటుకుపోయిందని, దాన్ని 70 రోజులు లేదా ఏడేళ్లలో తుడిచివేయలేమని మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేర్కొన్నారు. బీజేపీ 1980లో ప్రారంభమైనప్పటికీ దాని అనుబంధ సంస్థ జన సంఘ్‌ 1950 నుంచే కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను దోపిడీ చేయకపోవడం, వివక్ష లేకుండా అభివృద్ధి చేయడం వల్లే ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి రక్షణలో ఉన్నట్లు మైనార్టీలు భావిస్తున్నారని శుక్రవారం పీటీఐ ఇంటర్వ్యూలో నఖ్వీ వ్యాఖ్యానించారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు వల్ల మోదీకి మైనార్టీల్లో ప్రజాదరణ పెరిగిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ట్రిపుల్‌ తలాక్, ఆర్టికల్‌ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి కేంద్రం తెచ్చిన సంస్కరణ చర్యలని, అవి ప్రజాదరణ కోసం ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు