ఈ భేటీ వెనుక ఏ కథ?

3 Apr, 2018 09:23 IST|Sakshi
కుమారస్వామి, అనిత, నిఖిల్‌గౌడలతో సుదీప్‌

కుమారస్వామిని కలిసిన హీరో సుదీప్‌

మద్దతు కోరిన జేడీఎస్‌ నేత

అన్ని పార్టీలకూ సినీ స్టార్ల గ్లామర్, మద్దతు కావాలి.  జేడీఎస్‌ అగ్రనేత కుమారస్వామి హీరో కిచ్చ సుదీప్‌తో అదే చర్చిస్తున్నారు. బెంగళూరులో కుమార నివాసంలో సుదీప్‌తో మాటామంతీ    

యశవంతపుర: ప్రముఖ బహుభాషా హీరో సుదీప్‌ జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుటుంబాన్ని కలవడం రాజకీయ వేడిని పుట్టిస్తోంది. సోమవారం మధ్యాహ్నం కిచ్చ సుదీప్‌ బెంగళూరులో కుమార నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా రెండు గంటల పాటు రాజకీయాలపై చర్చించిన్నట్లు తెలిసింది. కుమార కుటుంబసభ్యులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. వచ్చే ఎన్నికలలో జేడీఎస్‌ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సుదీప్‌ను కుమార కోరినట్లు సమాచారం.

సుదీప్‌ మనసులో ఏముందో
కుమార సతీమణి అనిత, తనయుడు, వర్ధమాన హీరో నిఖిల్‌ గౌడలు సుదీప్‌తో ముచ్చటించారు. ఇటీవల నెలమంగళ ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీనివాసమూర్తి సుదీప్‌తో కలిసి జేడీఎస్‌ తరపుర ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది. ఇటీవల సుదీప్‌ సీఎం సిద్ధరామయ్యను కూడా కలవడం తెలిసిందే. దీంతో రాజకీయాల్లో సుదీప్‌ సాయం కోరే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కిచ్చ నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కన్నడలో టాప్‌ హీరోల్లో ఒకరైన సుదీప్‌ బాహుబలి, ఈగ వంటి తెలుగు హిట్‌ చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితమైన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా