పాక్‌ విలువలకు దివిటి ఆ గెలుపు!

2 Aug, 2018 16:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను అంతర్జాతీయ మీడియాకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. పాకిస్తాన్‌లో మానవత్వం, భిన్న మతాల మధ్య సామరస్యం ఉందని. నా విజయం మత తీవ్రవాద చీకటిలో మినుకుమినుకు మంటున్న వెలుగుకాదు. నా దేశ విలువలను చూపే దివిటి’ అని డాక్టర్‌ మహేశ్‌ కుమార్‌ మలానీ వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల పాకిస్తాన్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తొలి హిందువు. పార్లమెంట్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ముస్లింయేతరుడు.

పాకిస్తాన్‌ పార్లమెంట్‌కు ముస్లింయేతరులు పోటీచేసేందుకు వీలుగా, అలా పోటీ చేసిన వ్యక్తికి ముస్లింయేతరులు ప్రత్యేకంగా ఓటు వేసేందుకు వీలుగా 2002 నుంచి పాకిస్తాన్‌ ఎన్నికల్లో సంయుక్త ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చారు. ముస్లింయేతరుల కోసం పాక్‌ పార్లమెంట్‌లో పది నామినేట్‌ సీట్లను కూడా కేటాయించారు. ఈ పది నామినేట్‌ సీట్లను రాజకీయ పార్టీలకు  పార్లమెంట్‌లో గెలుచుకున్న సీట్ల సంఖ్యనుబట్టి కేటాయిస్తారు. మొత్తం పోలయిన ఓట్లలో కనీసం ఐదు శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ఈ నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు.

మహేశ్‌ కుమార్‌ మలానీ ముందుlవరకు ముస్లిం ఏతరులు నేరుగా పార్లమెంట్‌కు పోటీచేసి విజయం సాధించలేదు. ఈసారి ఎన్నికల్లో ఆయన పాకిస్తాన్‌ ఎంపీగా ఎన్నికై ఎంతో మంది ముస్లిం ఏతరులకు ఆదర్శంగా నిలిచారు. తనకు హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఓటువేసి గెలిపించారంటూ వారందరికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఆయన సింధు ప్రాంతంలోని తార్‌పార్కర్‌ 2 నియోజక వర్గం నుంచి గెలుపొందారు.

మరిన్ని వార్తలు