‘జేసీ దివాకర్‌రెడ్డి ఆస్తులు అమ్మితే.. ’

16 Jun, 2020 16:25 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి‌ అక్రమంగా సంపాదించిన ఆస్తులు అమ్మితే అనంతపురం జిల్లా ప్రజలను 20 ఏళ్ల పాటు పోషించొచ్చనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఫోర్జరీ డాక్యూమెంట్ల కేసులో అరెస్టైన జేసీ కుటుంబాన్ని పరామర్శించడం ద్వారా నారా లోకేష్‌ అవినీతి పరులకు మద్దుతు ఇచ్చినట్టయిందని మండిపడ్డారు. 154 వాహనాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి అడ్డంగా దొరికిపోయిన జేసీ కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించడం.. దానికి జేసీ దివాకర్ రెడ్డి ధైర్యం తెచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా ఏశారు. లోకేశ్ ఓ దద్దమ్మ అని ఎంపీ గోరంట్ల వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు