హిందూపురంలో బాలయ్య హల్‌చల్‌

12 Apr, 2019 10:06 IST|Sakshi
పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్‌తో బాలకృష్ణ సెల్ఫీ

సాక్షి, హిందూపురం: టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ గురువారం పోలింగ్‌ సందర్భంగా తన అనుచరగణంతోపాటు నేరుగా పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లి హల్‌చల్‌ చేశారు. బూత్‌వద్ద ఉన్న మహిళలు, యువకులతో కలిసి మాట్లాడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇదే సమయంలో పక్కనున్న నాయకులు ఓటర్లుకు తమ సైకిల్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. బాలకృష్ణ వెనుకనే సీఐ, పోలీసు సిబ్బంది ఉన్నా పోలింగ్‌ బూత్‌లలో వెళ్తున్న నాయకులు, కార్యకర్తలకు అడ్డు చెప్పకపోవడం గమనార్హం.  

చౌళూరులో ఉద్రిక్తత  
బాలకృష్ణ చౌళూరు పోలింగ్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌ చేశారు. పెద్దసంఖ్యలో నాయకులు, అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి వస్తుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు చౌళూరు రామకృష్ణారెడ్డి అక్కడున్న సీఐ సుబ్రహ్మణ్యంకు అభ్యంతరం చెప్పారు. సీఐ రామకృష్ణారెడ్డిని పక్కకు తోసేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వ్యతిరేకించారు. అడ్డుచెబుతున్న వారిని పోలీసులు తోసేస్తున్నా బాలకృష్ణ తన అనుచరులతో నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిపోయారు. పోలీసుతీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు