రాజ్యసభకు ‘కళింగ’ సామంత

17 Mar, 2018 02:23 IST|Sakshi

భువనేశ్వర్‌: విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఒడిశాకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త అచ్యుత సామంత ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులందరిలోకి పేద ఎంపీగా నిలిచారు. గురువారం బీజేడీ తరఫున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.

సామంత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం ఆయన పేరు మీద సొంత ఆస్తిపాస్తులు లేవు. బ్యాంకు ఖాతాలోరూ. 3.6 లక్షల నగదు, ఊరిలో 84 వేల విలువైన వారసత్వ ఆస్తే ఉంది. ఒడిశాలో కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ(కేఐఐటీ), కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(కేఐఎస్‌ఎస్‌) విద్యాసంస్థల ద్వారా ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తున్నారు. ఉచిత వసతి, భోజనం, వైద్యసేవలందిస్తున్నారు.

మరిన్ని వార్తలు