ఒకేరోజు 162 నామినేషన్లు! 

23 Mar, 2019 01:07 IST|Sakshi

లోక్‌సభ నామినేషన్లకు మిగిలింది 25వ తేదీ ఒక్కరోజే.. 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను శుక్రవారం ఒక్కరోజే 162 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 220కు పెరిగింది. టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు శుక్రవారం ఒకే సారి నామినేషన్లు వేయడానికి తరలిరావడంతో ఎన్ని కల సందడి కనిపించింది. నిజామాబాద్‌ నుంచి అత్యధికంగా 54 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో శనివారం, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల దాఖలకు సోమవారం (25వ తేదీ)ఒక్క రోజు మాత్ర మే మిగిలింది. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్‌ నుంచి రమేశ్‌ రాథోడ్‌ (కాంగ్రెస్‌), మెదక్‌ నుంచి గాలి అనీల్‌కుమా ర్‌ (కాంగ్రెస్‌), మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌ రెడ్డి(కాంగ్రెస్‌), నల్లగొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాం గ్రెస్‌), భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్‌ (టీఆర్‌ఎస్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), మహబూబాబాద్‌ నుంచి మాలోతు కవిత (టీఆర్‌ఎస్‌), బలరాంనాయక్‌ (కాంగ్రెస్‌), నాగర్‌కర్నూల్‌ నుంచి పి.రాములు (టీఆర్‌ఎస్‌), చేవెళ్ల నుంచి జి.రంజిత్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్‌)లు శుక్రవారం నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు