అభిమాన తరంగం​

5 Mar, 2018 07:17 IST|Sakshi

అద్దంకి నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర

కుంకుపాడు, అద్దంకి పట్టణ శివార్లలో జగన్‌కు ఘనస్వాగతం

తమ నేతను చూసేందుకు దారిపొడవునా మహిళలు, అభిమానుల ఎదురు చూపులు

అద్దంకి: ప్రజాసంకల్ప యాత్ర దర్శి నియోజకవర్గంలో ముగించుకుని, ఆదివారం ఉదయం అద్దంకి నియోజకవర్గంలోని కుంకుపాడు గ్రామం చేరుకుంది.  నియోజకవర్గంలోకి అడుగిడుతున్న తమ అభిమాన నేత జగన్‌మోహన్‌ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు, పరిసర గ్రామాల నుంచి వచ్చిన అభిమానులు,   నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. నడిచే దారి పొడవునా పూలు చల్లారు. దీంతో రహదారులన్నీ పూల బాటలుగా మారాయి.  కుంకుపాడు స్వాగత ద్వారం వద్ద మేళ తాళాలతో బాణా సంచా కాలుస్తూ.. ‘జై జగన్‌’ అంటూ.. అభిమానులు నిరాజనం పట్టారు. కుంకుపాడులో జెండా, వైఎస్సార్‌ విగ్రçహావిష్కరణతో పాటు, తిమ్మాయపాలెం గ్రామాల్లో పార్టీ జెండాలను జగన్‌ ఆవిష్కరించారు. ఆయనతో కలిసి మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెట్లు, చేమలను లెక్క చేయకుండా పరుగులు తీశారు. మోదేపల్లి పరిసర గ్రామాల నాయకులు కుంకుపాడులో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.

గంటల తరబడి నిరీక్షణ..
తమ అభిమాన నేత ఎప్పుడొస్తాడా అంటూ స్త్రీలు, వృద్ధులు గంటల తరబడి ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూశారు. అద్దంకి పట్టణంలో జగన్‌ ప్రసంగ సమయంలో బహుళ అంతస్తుల భవనాలపై ఎక్కి మరీ తమనేత ప్రసంగాన్ని విన్నారు. బహిరంగ సభ ప్రాంతం జన సంద్రంలాగా మారింది. రెడ్డిపాలెం నుంచి 200 బైకులతో ర్యాలీగా తరలి వచ్చారు.

అడుగడుగునా వినతులు..
పాదయాత్రలో ఉన్న జగన్‌కు వివిధ రాకాల సమస్యలపై ప్రజలు దారి పొడవునా వినతులను అందజేశారు. కొటికలపూడి పునరావాస కాలనీ (రామచంద్రాపురం)లో ఎటువంటి మౌలిక వసుతులు కల్పించలేదని, సీపీఎస్‌ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలని, పనులు లేక ఇటుక బట్టీల కూలికి వచ్చిన తమకు పనులు కల్పించేలా చూడాలని గోదావరి జిల్లా వాసులు జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు తమ సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ఏపీ ఉద్యాన శాఖలో ఒక్క విస్తరణ నియామకం కూడా జరగలేదని, అద్దంకి హార్టీ కల్చర్‌ ఎంపీఈఓ స్వర్ణలత జగన్‌ను కలిసి వినతి పత్రాలు అందజేసింది. ఇదే విధంగా గిరిజన సమస్యలపై జేజేసీ నేతలు, పింఛన్‌ ఊడబెరికారంటూ వృద్ధులు, టీడీపీ నేతలు ఇల్లు తగుల బెట్టారంటూ జే పంగులూరు మండలం రామకూరుకు చెందిన ఆసోద బంగారుబాబు వినతిపత్రం అందజేశారు.

 ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు అద్దంకి, కొరిశపాడు, జే పంగులూరు మండలాలకు చెందిన నాయకులు, జ్యోతి హనుమంతరావు, చింతల పేరయ్య, యర్రం బ్రాహ్మారెడ్డి, స్వయంపు హనుమంతరావు, మద్దినేని గోపి, స్టీరింగ్‌ కమిటీ నాయకుడు చిలకూరి సాంబశివరావు, బీవీకే రెడ్డి, రమాదేవి, హనుమాయమ్మ, అబీదా, గూడా శ్రీనివాసరెడ్డి, సోము పరమేశ్వరరెడ్డి, కొంచా శ్రీనివాసరెడ్డి, సింగమనేని నాగేశ్వరరావు, తిమ్మాయపాలెం గ్రామ మాజీ సర్పంచ్‌ అడుసుమల్లి బాలమురళీ కృష్ణ, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, శివారెడ్డి, సందిరెడ్డి హనుమంతరావు, మద్దిరెడ్డి సుబ్బారెడ్డి, ఏ రామాంజనేయులు, గంగినేని సుబ్బారావు, రాఘవ, మేదరమెట్ల సర్పంచ్‌ పేరం నాగలక్ష్మి, మండల నాయకులు మన్నె మదుసూధనరావు, కరణం సుబ్బయ్య, యర్రం రత్నారెడ్డి, మాజీ ఎంపీపీ అన్నెం అంజిరెడ్డి, పల్లెర్ల శ్రీనివాసరెడ్డి, వడ్లమూడి శ్రీనివాసరావు, షేక్‌ రసూల్‌ బాషా, జంపు వెంకట్రావు, యూ అంకాలరావు, హనుమంతరావు  పాల్గొన్నారు.

300 వాహనాల్లో కదిలిన నేతలు
సంతమాగులూరు: ప్రజా సంకల్ప యాత్ర  ఆదివారం అద్దంకి వచ్చిన   సందర్భంగా జరిగిన జగన్‌ బహిరంగ సభకు సంతమాగులూరు మండలం నుంచి 300 వాహనాల్లో 5 వేల మందితో తరలివెళ్లినట్లు రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి అట్లా చిన్నవెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యర్రంరెడ్డి బ్రహ్మారెడ్డి, కొండలు, ఆదం రఫీ, మక్కెన శ్రీరామూర్తి, కొమ్మాలపాడు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

యాత్రకు తరలిన నేతలు..
బల్లికురవ: జగన్‌ పాదయాత్రకు బల్లికురవ మండలం నుంచి కార్యకర్తలు అభిమానులు  భారీగా తరలివెళ్లారు. మండల నాయకులు చింతలపేరయ్య, కల్లి అంజినీ ప్రసాద్‌రెడ్డి, షేక్‌ శ్రీనువలి, సింగరకొండ, అబ్దుల్లా, షఫీ, గోగినేని వీరాంజనేయులు, కోవూరి ప్రభాకరరావు, ఇప్పల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అద్దంకి బహిరంగ సభకు 500 వాహనాలతో పాటు ద్విచక్రవాహనాలు ర్యాలీగా అద్దంకి బయల్దేరారు.

జగన్‌తోనే.. రాజన్న రాజ్యం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గరటయ్య
అద్దంకి: రాజన్న రాజ్యం కావాలంటే జగన్‌ సీఎం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్య అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో వర్షాలు లేవన్నారు. ఆయన అడుగు పెడితేనే వర్షాలు పడవని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. చంద్రబాబూ అదే నమ్ముతున్నాడన్నారు. నాగార్జున సాగరు నీరు ఇవ్వమంటే, వచ్చే ఏడాది తాగునీటి కోసం అని చెప్పటం, తన ప్రభుత్వంలో వర్షాలు పడవనే గట్గినమ్మకంతోనేనన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన పథకం పనులను నత్తనడకన సాగించకుండా, పూర్తిచేస్తే వేలాది ఎకరాల బీడు భూములు మాగాణి భూములుగా మారతాయన్నారు. గుండ్లకమ్మ వద్ద చెక్‌ డ్యామ్‌ ఏర్పాటుతో తిమ్మాయపాలెం, యర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోల పథకంతో, కోరిశపాడు మండంలో 20 వేల ఎకరాలు భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. అదే విధంగా భవనాశి రిజర్వాయరు పూర్తితో 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జే పంగులూరు మండలంలోని కొండమూరు, రావమ్మ కుంటను రిజర్వాయర్లుగా మారిస్తే మరో 5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులను అదుకోవాల్సింది పోయి పీల్చి పప్పి చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక పాలన సాగుతోందని, ఆ పాలనకు చరమ గీతం పాడి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. దానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలిపునిచ్చారు.

మరిన్ని వార్తలు