ప్రతిపక్షాల మానవహారం

6 Apr, 2018 02:07 IST|Sakshi
పార్లమెంటు ఆవరణలో నినాదాలిస్తున్న ప్రతిపక్షాల నేతలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించటంలో అధికార ఎన్డీఏ విఫలమైందంటూ ప్రతిపక్షాలు గురువారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపాయి. పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, వామపక్షాలు, ఎన్‌సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీ తదితర 17 పార్టీల నాయకులు అరగంటపాటు మానవహారంగా ఏర్పడ్డారు.

వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు..’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. మరోమార్గం లేకనే ప్రభుత్వ వైఖరిపై ఈ నిరసన తెలిపామన్నారు.  ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చు కునేందుకు.. వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణం, ఎస్టీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు, సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలను తాము ప్రస్తావించకుండా అడ్డుకుం దని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు