వ్యూహం.. దిశానిర్దేశం

5 Oct, 2019 10:00 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఒక్కరోజే ఆపార్టీ ముఖ్య నేతల రాకతో హుజూర్‌నగర్‌లో రాజకీయ జోష్‌ కనిపించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌ షో నిర్వహించారు. అలాగే తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆపార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కేడర్‌తో సమావే శం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొ ని పార్టీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చే యాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కేడర్‌తో పెట్టిన సమావేశానికి బీజేపీ జాతీయ నాయకులు హాజరయ్యారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో కలిపి సరిగ్గా పదిహేను రోజుల సమయం ఉంది.

సీపీఎం మినహా ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తున్నారో, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలంతా ఒకే రోజు హుజూర్‌నగర్‌ కేంద్రానికి వచ్చి పార్టీ కేడర్‌కు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచిచి రాత్రి వరకు పార్టీల నేతల రాక, సమావేశాలు, ప్రచారాలతో హుజూర్‌నగర్‌ అంతా రాజకీయ కోలాహలానికి వేదికైంది.  

గులాబీ రోడ్డు షో.. 
ఈ ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ హుజూర్‌నగర్‌కు వచ్చారు. పట్టణంలో కేటీఆర్‌ రోడ్డు షో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల ఎమ్మెల్సీలు కేటీఆర్‌ వెంట రోడ్డుషోలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కేడర్‌ను ఈరోడ్డు షోకు తరలించడంతో కేటీఆర్‌ పర్యటన భారీగా సక్సెస్‌ అయిందని, విజయం తమదేనని ఆపార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

కేటీఆర్‌ పర్యటన తర్వాత ఉమ్మడి జిల్లా ముఖ్యులతో కొంతసేపు మాట్లాడారు. ప్రచారాన్ని ఇంకా ఎలా ఉధృతం చేయాలి, కేడర్‌ ఇచ్చే సూచనలపై వీరితో చర్చించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఎక్కడకూడా జరగకుండా చూడాలని అభ్యర్థితో పాటు ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటర్‌రెడ్డి ఆపార్టీ కార్యకర్తలకు చెప్పారు.   

అందుకే కాంగ్రెస్‌కు మద్దతు.. 
ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉందని రెచ్చిపోతోందని అందుకే తెలంగాణ జన సమితి .. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. విద్యా,వైద్య, వ్యవసాయ, ఇతర రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేడర్‌కు సూచించారు. ఈ నెల 10 నుంచి ప్రచారం మరింత వేగిరం చేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.  ఆయన కూడా ప్రచారంలో నేరుగా పొల్గొంటారని తెలిసింది. ఈ సమావేశానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌కు జన సమితి మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో.. కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్‌కు ఉన్న ఓట్లు ఎన్ని అని ఇతర రాజకీయ పార్టీల నేతలు అంచనావేస్తున్నారు.  

తామేంటో నిరూపించాలని.. 
ఈ ఎన్నికల్లో తామేంటో నిరూపించుకోవాలని, పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయి విజయం కోసం కేడర్‌ పని చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి తమ సత్తాచాటామని, ఉద్యమ సమయంలో టీడీపీని కొన్ని పార్టీలు ఇబ్బంది పెట్టినా.. తెలంగాణలో పార్టీ ఇప్పటికి బలంగా ఉందన్నారు. అ లాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కోటా రామారావు విజయాన్ని కాంక్షిస్తూ జాతీయ కార్యవర్గ సభ్యు లు, పార్టీ ఉప ఎన్నికల ఇన్‌చార్జి పేరాల చంద్రశేఖర్‌ నేతృత్వంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ బీసీ అభ్యర్థికి టికెట్‌ కే టాయించడం బడుగు, బలహీన వర్గాలకు దక్కి న గౌరవమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓ ట్లు రాబట్టాలని పార్టీ నేతలకు వివరించారు. 

మరిన్ని వార్తలు