హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ఇలా...

24 Oct, 2019 16:33 IST|Sakshi

సాక్షి, హుజుర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్‌ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ, టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గ చరిత్రలొనే అత్యధిక  మెజార్టీతో విజయదుందుభి మోగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేతిలో సైదిరెడ్డి 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ట్రక్‌ సింబల్‌.. కారు గుర్తును పోలివుండటంతో తాను ఓడిపోయానని సైదిరెడ్డి అప్పట్లో వాపోయారు. ఉప ఎన్నికల ఫలితంతో ఆయన వాదనలో వాస్తముందని తేలింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా