రాజుకుంటున్న ‘హుజూర్‌నగర్‌’ 

8 Oct, 2019 03:32 IST|Sakshi

ప్రధాన పారీ్టల బలగాలన్నీ హుజూర్‌నగర్‌లోనే మోహరింపు 

అన్ని అ్రస్తాలు ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్‌... దూకుడుగా ఉత్తమ్‌ 

బడా నేతలను బరిలో దింపుతున్న బీజేపీ... గందరగోళంగా సీపీఎం 

దసరా తర్వాత కూడా నియోజకవర్గంలో పండుగ వాతావరణమే 

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం, పార్టీల మద్దతు తేలిపోవడం, ఎంత మంది అభ్యర్థులు రంగంలో ఉంటారో ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించడంతో పాటు అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో రెండు పారీ్టలు శాయశక్తులా పోరాడుతున్నాయి. 

ఈ రెండు పార్టీలకు తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ కూడా ఈసారి రంగంలో నిలబడటంతో హుజూర్‌నగర్‌ ఉప పోరు రక్తికట్టిస్తోంది. అన్ని పారీ్టలు తమ బలగాలన్నింటినీ అక్కడే మోహరించిన నేపథ్యంలో గ్రామగ్రామాన కాళ్లకు బలపాలు కట్టుకుని నేతలు తమ అభ్యర్థుల కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోజూ ఎన్నికల సందడి కనిపిస్తోంది.  

ప్రచార హోరు... కార్యకర్తల్లో జోరు 
టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలయినా ఈసారి కైవసం చేసుకోవాలని ప్రయతి్నస్తోంది. పార్టీ ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని గులాబీ దళం గ్రామాలను చుట్టివస్తోంది. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సామాజిక వర్గాల వారీగా విభజించుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా నామినేషన్ల చివరి రోజున భారీ సభనే నిర్వహించింది. 

పార్టీ అతిరథ మహారథులు హాజరైన ఈ సభతో పార్టీ నేతల్లో ఐక్యత వచి్చందనే అభిప్రాయంతో కేడర్‌ ఉరకలు పెడుతోంది. ఉత్తమ్‌కు తోడుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, పండుగ తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారానికి రానుండటంతో హస్తం పార్టీ కూడా అధికార పారీ్టకి ధీటుగానే ప్రచార బరిలో దూసుకుపోతోంది. ఇక, బీజేపీ కూడా మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జులను నియమించి వీలునన్ని ఎక్కువ ఓట్లు రాబట్టుకునేలా ప్రయతి్నస్తోంది. టీడీపీ కూడా తన ఓటు బ్యాంకును రక్షించుకునే ప్రయత్నంలో ప్రచారం నిర్వహిస్తోంది. 

స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, సీపీఎం మాత్రం ఈ ఉప ఎన్నిక కారణంగా ఆత్మరక్షణలో పడింది. అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం పార్టీ నేతలను షాక్‌కు గురి చేసింది. దీంతో అభ్యర్థిని సస్పెండ్‌ చేసి పార్టీ జిల్లా కార్యదర్శిని బాధ్యతల నుంచి తప్పించే వరకు వ్యవహారం వెళ్లిపోయింది. అయితే, అధికారికంగా పార్టీ పక్షాన ఓ స్వతంత్ర అభ్యరి్థకి మద్దతు ప్రకటించినా కార్యకర్తలు ఏం చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగానే మారింది.  

జీ హుజూరా... జై హుజూర్‌నగరా..? 
హుజూర్‌నగర్‌లో రోడ్‌షోకు వెళ్లిన సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ వ్యాఖ్య నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. జీ హుజూరా? జై హుజూర్‌నగరా? అంటూ కేటీఆర్‌ చేసిన ఈ కామెంట్‌ను టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పారీ్టలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. నియోజకవర్గ ప్రజలు ఉత్తమ్‌కు జీ హుజూర్‌ అనకుండా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి జై కొట్టాలనే అర్థంతో చేసిన కేటీఆర్‌ వ్యాఖ్యను క్షేత్రస్థాయి ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నేతలు బాగానే వాడుకుంటున్నారు. 

అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఈ వ్యాఖ్యను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ఆయన్ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదని, అలాంటి వ్యక్తి నియోజకవర్గంపైకి వందలాది మంది నేతలను పంపి దండయాత్ర చేయిస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసీఆర్‌ దొరపాలనకు జీ హుజూర్‌ అనకుండా నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి జై హుజూర్‌నగర్‌ అనాలని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇతర పారీ్టలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచారంలో కూడా ఈ వ్యాఖ్యలు చర్చకు వస్తుండటం గమనార్హం.  

ఎవరేం చేస్తారో..? 
గత ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల మధ్య జరిగితే ఈసారి రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బహుముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ, టీడీపీతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్లే ఎవరికి నష్టం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక, గత ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారుతో సామీప్యత ఉన్న ట్రక్కు వల్ల తాము నష్టపోయామని టీఆర్‌ఎస్‌ వాపోతుండగానే, అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తులు కూడా నష్టం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ముఖ్యంగా రోడ్‌ రోలర్, ట్రాక్టర్‌ నడిపే రైతు గుర్తులు కారు గుర్తును గందరగోళం చేస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పారీ్టల అభ్యర్థులు, స్వతంత్రులు, ఎన్నికల గుర్తులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికి మేలు చేస్తాయి... ఎవరికి నష్టం చేస్తాయన్నది ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ప్రధాన పారీ్టలు ఎప్పటికప్పుడు తమ పరిస్థితిపై సర్వేలు, నివేదికలు తెప్పించుకోవడం ప్రారంభించాయి. మొత్తం మీద హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కారణంగా దసరా తర్వాత కూడా మరో 15 రోజుల పాటు పండుగ వాతావరణమే కనిపించనుంది. 

మరిన్ని వార్తలు