నేను తెలంగాణ పిచ్చోడిని: కేసీఆర్‌

2 Sep, 2018 19:09 IST|Sakshi

సాక్షి, కొంగకలాన్‌: ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. ఇది జనమా? ప్రభంజనమా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను సవివరంగా తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన చేపట్టిన పథకాల గురించి వివరించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చెప్పారు.

కేసీఆర్‌ ప్రసంగంలో ఉటంకించిన మాటలు కొన్ని...

  • ఇది జనమా? ప్రభంజనమా?
  • తెలంగాణ అప్పట్లో వలస పాలకుల ప్రయోగశాలగా మారింది
  • ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు
  • తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా పాత్రధారులే
  • ప్రాణం పోయినా సరే మడమ తిప్పను, మాట తప్పను
  • తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పా
  • తెలంగాణ ప్రజలు కలిసి వచ్చి, కదిలివచ్చి అద్భుతం చేశారు
  • సీపీఐ పార్టీని ఒప్పించడానికి 38 సార్లు తిరిగా
  • నేను తెలంగాణ పిచ్చోడిని అని ఏబీ బర్దన్‌కు చెప్పా
  • కూలిపోయిన కులవృత్తిదారుల బాధ వర్ణణాతీతం
  • తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్నల ముఖంలో వెలుగులు చూస్తున్నాం
  • కంప్యూటరే కాదు గొర్రెలు పెంచడం కూడా వృత్తే
  • తెలంగాణ సమాజంలోని దుఃఖాన్ని పంచుకోవాలన్న
  • 24 గంటల విద్యుత్‌తో తెలంగాణ వెలుగులు జిమ్ముతోంది
  • మీకు ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా
  • ఓట్లు అడగను అనే మాట చెప్పాలంటే ఖలేజా కావాలి
  • రాజకీయ అవినీతిని నిర్మూలించి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి
  • రాష్ట్ర సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతాం
  • మేము చేసిన పనులు డప్పు కొట్టే పనిలేదు
  • మళ్లీ కేసీఆరే రావాలని ప్రజావాణి చెబుతోంది
  • రాజకీయంగా కేసీఆర్‌ ఏం చెబుతాడో అందరూ చూస్తున్నారు
  • తెలంగాణ వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తది
  • కేసీఆర్‌ సీఎంగా లేకపోతే 95 శాతం ఉద్యోగాలు  సాధ్యవ
  • కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలె
  • మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ భాసిల్లాలె
  • ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయి
  • జరిగిన ప్రగతి ప్రజల కళ్ల ముందున్నది
  • ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అన్నాయి
  • తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఢిల్లీలో జరగాలా?
  • మళ్లీ ప్రజలు దీవిస్తే.. అన్ని సాధిస్తా
మరిన్ని వార్తలు