నేను కుర్చీని లెక్కచేయను : మోదీ 

8 Dec, 2017 16:37 IST|Sakshi

బనస్కాంత (గుజరాత్‌) : 'నేను రైతుల సంరక్షణ కోసం ఆరాటపడతాను.. నా కుర్చీ కాపాడుకునేందుకు కాదు' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ సభలో మాట్లాడుతూ 'నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన సమయంలో పఠాన్‌, బనస్కాంత ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు వచ్చి నన్ను కలిశారు. నేను వారిని వ్యవసాయం మీద దృష్టి సారించాలని చెప్పాను.

నా విధానాలు చూసి నేను ఇలాగే ముందుకు వెళ్లిపోతే ఓడిపోవడం ఖాయం అని కొంతమంది చెప్పారు. వారితో అన్నాను.. నేను నా కుర్చీని లెక్క చేయను అని.. నేను రైతులకోసం పనిచేయాలనుకుంటున్నానని, పఠాన్‌, బనస్కాంత రైతులకోసం పనిచేయాలనుకుంటున్నానని అన్నాను' అని మోదీ చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీకి మధ్య తేడా ఏమిటో గుజరాత్‌ ప్రజలకు తెలుసని అన్నారు. గుజరాత్‌లో వరదలు వచ్చిన సమయంలో బీజేపీ వాళ్ల సహాయ చర్యల్లో మునిగి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బెంగళూరులో సేద తీరారని చెప్పారు. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు