‘ఎంపీ సీటు నా భార్యకివ్వాలని అడుగుతా’

22 Dec, 2018 17:03 IST|Sakshi
తూర్పు జగ్గా రెడ్డి

హైదరాబాద్‌: ఇటీవల గెలిచిన కాంగ్రెస​ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పార్టీ మారతారని అనుకోవడం లేదని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి(జగ్గా రెడ్డి) వ్యాఖ్యానించారు. మీడియాతో జగ్గారెడ్డి చిట్‌చాట్‌ చేశారు. మెదక్‌ పార్లమెంటు సీటు నా భార్యకు ఇవ్వాలని అడుగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హెడ్‌ మాస్టర్‌ విద్యార్థులకు చెప్పిన్నట్లు సంగారెడ్డి ప్రజలకు నేను గెలిస్తే ఏంచేస్తానో చెప్పానని అందువల్లే వారు తనను గెలిపించినట్లు వెల్లడించారు. కేసీఆర్‌ ఒక సీఎం..నేను ప్రభుత్వంలో ఒకడిని మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇమేజ్‌ కాపాడుతూ..సంగా రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ అభివృద్ధి చేస్తానని చెప్పారు.

కొందరికి కొన్ని బలహీనతలు ఉన్నాయని, వారి బలహీనతలను తెలుసుకుని అండగా ఉంటే ఎవరూ పార్టీని వీడరని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్‌ అయ్యామని తెలిపారు. సీఎల్పీగా అవకాశమిస్తే న్యాయం చేస్తానని, పార్టీకి తాను ఎలిజిబుల్‌ అనిపించి ఇస్తే తీసుకుంటానని స్పష్టం చేశారు. కర్ణుడు చావడానికి ఎన్ని కారణాలో జగ్గారెడ్డి గెలవడానికి అన్ని కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. నా బిడ్డ, క్యాడర్‌ కృషి వల్లే మళ్లీ గెలవగలిగానని జగ్గారెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా