చేతిలో గొడ్డలి.. కార్యకర్త తల నరికేస్తానన్న సీఎం

12 Sep, 2019 11:07 IST|Sakshi

చండీగఢ్‌: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహనం కోల్పోయారు. ఒక కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నించడంతో ఆయనకు కోపం వచ్చింది. ఒక చేతిలో గొడ్డలి పట్టుకున్న ఆయన.. తల నరికేస్తానంటూ సదరు కార్యకర్తపై చిందులు తొక్కారు. ఇటీవల జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది.

యాత్రలో భాగంగా ఓపెన్‌ మినీ ట్రక్‌ టాప్‌పై నిలబడి ఖట్టర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఆయనకు గొడ్డలిని బహూకరించారు. గొడ్డలి ర్యాలీలోని ప్రజలకు చూపిస్తుండగా మరో కార్యకర్త ఆయన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఖట్టర్‌కు ఒక్కసారిగా కోపం వచ్చింది. అంతే, సదరు కార్యకర్తను ‘మెడ కొసేస్తా నీది’ (గార్దన్‌ కాట్‌ దూంగా తేరి) అంటూ హెచ్చరించారు. ఆ కార్యకర్త చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కూడా ఈ వీడియోను షేర్‌ చేశారు. అయితే, ఈ వీడియోపై ఖట్టర్‌ స్పందిస్తూ.. కిరీటాలను తొడిగే రాజరిక సంప్రదాయానికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరమగీతం పాడిందని, ఎవరైనా కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నిస్తే తనకు కోపం వస్తుందని, దానిని సహించబోనని తెలిపారు. అయితే, కోపంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆ కార్యకర్త బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బైక్‌ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!

‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’

‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ? 

2022 నాటికి పీవోకే భారత్‌దే

ఏరీ... ఎక్కడ!

పుస్తకాలు, టవల్స్‌ ఇవ్వండి..: మంత్రి

పల్నాడు ప్రజల మనోభావాలకు గాయం చేయొద్దు

నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు

పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

దుష్పచారాన్ని తిప్పికొట్టాలి

మండలి చైర్మన్‌గా గుత్తా

ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌

దళితుల వల్లే ఈ దరిద్రం.. డీసీపీ యూజ్‌లెస్‌ ఫెలో

బిహార్‌లో ఎన్‌డీఏ కెప్టెన్‌ నితీష్‌..?!

జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే

కారణం చెప్పి.. రామన్న కంటతడి

‘డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టారు’

అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’

కాంగ్రెస్‌-ఎన్సీపీల సీట్ల సర్ధుబాటు

‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’

‘అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు’

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ

‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

‘రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి’..

‘కాలా’ను విడుదల చేయొద్దు

ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్‌

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!