నేను క్షమాపణ చెప్పను: ప్రియాంక 

15 May, 2019 12:35 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో జైలు నుంచి విడుదలైన బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర‍్మ తనపట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్‌ చేశారని వ్యాఖ్యానించారు. ఫోటో మార్ఫింగ్‌పై తాను క్షమాపణ చెప్పేది లేదని ప్రియాంక శర్మ మరోసారి స్పష్టం చేశారు. తనతో అధికారులు బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టు నిన్న బెయిల్‌ మంజూరు చేసినా, అధికారులు మాత్రం తనను ఇవాళ విడుదల చేశారని ఆమె అన్నారు. అంతేకాకుండా తన కుటుంబసభ్యులతో పాటు న్యాయవాదిని కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రియాంక శర్మ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ట్రోల్‌ చేసినందుకు మమతా బెనర్జీనే అరెస్ట్‌ చేయాలని ప్రియాంక శర్మ డిమాండ్‌ చేశారు. తనపై పెట్టిన కేసుపై పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నేను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్‌ చేశారు

చదవండి: (మమత సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక)

మరిన్ని వార్తలు