తినే అలవాట్లు బట్టి ఏ దేశమో చెప్పొచ్చు..

24 Jan, 2020 08:40 IST|Sakshi

భోపాల్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బంగ్లాదేశీయలు ఎక్కడున్నా వెంటనే గుర్తించవచ్చని, వారి అలవాట్ల ఆధారంగా  బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా నిర్ధారించవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే ఆ దేశానికి చెందిన కొందరు కేవలం అటుకులు మాత్రమే తింటారని, వారు తినే విధానం ద్వారా కూడా ఆ దేశ పౌరులను కనిపెట్టవచ్చని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ మద్దతు సభలో ఆయన ప్రసంగించారు.

పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని.. ఆహారపు అలవాట్ల ఆధారంగా గుర్తించాలని పేర్కొన్నారు. దేశంలో అనేక మంది భవన నిర్మాణ కూలీలు బంగ్లాదేశ్‌ నుంచి బెంగాల్‌ సరిహద్దుల్లో ద్వారా దేశంలోకి చొరబడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనికి నివారించడానికే కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని వివరించారు. దీనికి దేశ పౌరులంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు