మోదీ.. కశ్మీర్‌ను వదిలేయ్‌!

27 Apr, 2019 19:54 IST|Sakshi

దివాళా తీయనున్న కశ్మీర్‌ను ఎందుకు కోరుకుంటున్నారు?

ప్రధాని మోదీకి మెహబూబా ముఫ్తి ప్రశ్న

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 జమ్మూకశ్మీర్‌కు తీవ్ర నష్టం చేకూర్చిందన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై  ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 అంత చెడ్డదైతే.. రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోవాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

‘మన అనుబంధానికి ఆర్టికల్‌ 370 పునాది కాదని ప్రధాని మోదీ భావిస్తే.. అప్పుడు కశ్మీర్‌ను వదిలేయండి. కశ్మీర్‌ దివాలా తీయబోతోందని ఆయన భావిస్తే.. కశ్మీర్‌ను వదిలేయమనండి. ఆ దివాలా భారాన్ని ఆయన ఎందుకు మోయాలి’ అని ముఫ్తి ప్రశ్నించారు. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రాతిపత్తి వల్ల అక్కడ ఐఐఎంలు, ఐఐటీలు స్థాపించినా.. అక్కడికి వెళ్లేందుకు ప్రొఫెసర్లు సిద్ధపడటం లేదని, సొంతంగా భూమి కొనే వెసులుబాటు లేకపోవడం, అద్దెలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణమని, ఈ నిబంధనల వల్ల పెట్టుబడులు కూడా అక్కడికి రావడం లేదని, ఉగ్రవాదులు పర్యాటక రంగాన్ని నాశనం చేశారని, జమ్మూకశ్మీర్‌ దివాలా దిశగా చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు