పీవీ ఆ మాట వినివుంటే.. మరోలా వుండేది

5 Dec, 2019 10:40 IST|Sakshi

1984 సిక్కు అల్లర్లపై మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కు అల్లర్లు  జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని అన్నారు. గుజ్రాల్‌ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు.

ఆ సలహాను పీవీ ఆచరించి ఉన్నట్లయితే సిక్కు అల్లర్లు జరిగి ఉండేవే కావని అన్నారు. కాగా ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐకే గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా