విజయానికి మారు పేర్లు

29 Apr, 2019 02:58 IST|Sakshi
సుమిత్రా మహాజన్‌, ఎల్‌కే అడ్వాణీ, సోనియా గాంధీ, మునియప్ప

దశాబ్దాలపాటు లోక్‌సభ సభ్యులుగా కొనసాగిన, కొనసాగుతున్న ప్రముఖులు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత తేలికయిన విషయమేమీ కాదు. కానీ, కొందరు రాజకీయ నేతలు గెలుపునే అలవాటుగా మార్చుకున్నారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఇంత ఈజీయా అనుకునేలా దశాబ్దాలపాటు కొనసాగారు. కొందరు ఇంకా కొనసాగుతున్నారు. ఉదాహరణకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌.. బీజేపీకి చెందిన ఈమె ఇండోర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, కాంగ్రెస్‌కు చెందిన కె.హెచ్‌.మునియప్ప కర్ణాటకలోని కోలార్‌ నియోజకవర్గం నుంచి ఏకంగా ఏడుసార్లు క్రమం తప్పకుండా ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా 8వసారీ బరిలో నిలిచారు. వీరందరినీ మించి ఇంద్రజిత్‌ గుప్తా 11 పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర భారతంలో లోక్‌సభ సభ్యులుగా అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న కొందరు హేమాహేమీల వివరాలివీ..


ఇంద్రజిత్‌ గుప్తా, మనేకా గాంధీ, కమల్‌ నాథ్‌

మరిన్ని వార్తలు