సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: ఇంద్రసేనారెడ్డి

13 Oct, 2019 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి మొండి పట్టుదలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చి, సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని, దురహంకార పద్ధతుల్లో్ల బీజేపీ నేతలను అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు అత్యుత్సాహంతో అమర్యాదకరంగా వ్యవహరించడం వల్లే లక్ష్మణ్‌ అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. గవర్నర్‌ పదవిని కించపరుస్తూ సీఎం సీపీఆర్వో వ్యాసం రాసినందుకు ఆయనను తొలగించాలని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా