‘రాష్ట్రంలో బీసీలకు అన్యాయం’

12 Jun, 2018 13:38 IST|Sakshi
కలెక్టర్‌ రామ్మోహన్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్‌ ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, ధన్‌పాల్‌ సూర్య నారాయణ గుప్తా, బస్వ లక్ష్మీనర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్‌ శంకర్, జిల్లా ఇన్‌చార్జి నీలకంఠ రాజు తదితరులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు.

బీసీల సంక్షేమానికి నిధులివ్వాలని కోరుతూ కలెక్టర్‌ రామ్మోహన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించినా వాటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కేవలం రూ. 5,919.83 కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓబీసీలకు చట్ట సభలు, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, ఉపాధ్యక్షులు రాజన్న, నాయకులు అరుణ్, శ్రీనివాస్, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు